Wednesday, December 31, 2008

కనకాంబరం కోసం....

కొండ మల్లివో- కోకిలమ్మవో
జాబిలి కిరనానివో-వెన్నెల లోగిలివో
అల పొంగువో- సెలయేటి చిన్డువో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...

మంచు ముత్యానివో- చలి సంగీతానివో
వేకువ వేలుగువో-జలపాతపు జిలుగువో
చీకటి సంబరానివో- ఉదయ చుమ్బనానివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...

కన్నీటి చుక్కవో- కంటి పాపవో
కలలోని స్వర్గానివో- ఇలలోని శిల్పానివో
కనికత్తుల చిత్రానివో- కమ్మనైన గీతానివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...

ఒదార్పువో- సంభ్రమ సంకేతానివో
నవ్వుల నేచ్చేలివో- నన్నల్లుకున్న లతవో-నును నిగ్గుల దోసిలివో
గుండెలో దీపానివో-గొంతు లోని పాతవో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...

నీడవో- వెలుగు జాదవో
వేదనవో- వేయి పున్నముల వెన్నెలవో
ప్రేమవో- ప్రణయ రాజ్య సామ్రాగ్నివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి...

చేయుతవో- చేమంతి చేక్కిలివో
ధైర్యానివో-మనసులోని దైవానివో
జీవన సహచరివో-నా జీవన నాదానివో
ఏమైతేనేం
నువ్వు నా కనకామ్బరానివి..
నా అందవి- కైదందవి...
నా బంగారుకొందవి.....
...........మా harikrushna

పారోడి సాంగ్ -- pithaamagan

చిలకమ్మ పలికేనే- కనకమ్మ నవ్వెనే
అరుదైన ప్రేమతో మనసే గంతులేసేనే
వరదై పొంగి పోయెనే.....

కనక ప్రేమలోని మధు మాసం
వచ్చెనమ్మ ఇక నా కోసం
నీవే నా సొంతమంది- నేనే నీ బంధమంది
సాగే అలలలో పొంగి- ఊగే మేఘమై వంగి
కుగిలింతలై కరిగిన వేళ
చిరుగాలి వీచెనే- మరు మల్లె విరిసేనే
కనకమ్మ గుండెలో కృష్ణుడు సేద తీరెనే
పాటై పల్లవించేనే...
-------మా harikrushna

Saturday, July 12, 2008

స్వర్గ ప్రవేశం

వేకువ వెలుగులు ముగ్గులల్లదానికి ముందే
రాత్రి మేఘాలు విచ్చిన్నమవడానికి ముందే
నిద్రానిద్ర, కల-మెలకువల ఊగిసలాట సమయాన
ప్రేమిక వాణివి 'సెల్' లో ఆహ్వాన గీతాన్ని పాడుతావు
తొలి ఉదయ వేలనే ఆహ్లాదంగా పలకరించి
స్వర్గాన్ని నా ఎదుట పునర్ప్రతిష్ట చేస్తావు
స్వప్నాస్వప్న జగత్తులోకి చేయిపట్టి తీసికేల్తూ
అనురాగ కుగిలిలో వివశున్ని చేస్తావు..
ఇక,
స్వర్గాన్ని చేతితో, కళ్ళతో, నాలుకతో, పెదాలతో
తడుముతూ,చూస్తూ,స్పృశిస్తూ,చుమ్బిస్తూ
బింబ ప్రతిబింబాల దోబూచులాటలు
దేహ కోణాల కంపన-ప్రకంపనల-ప్రచోదనాల శ్వాసలు
శరీర మంతనాలు-మనో మధనాల అద్వైతంలో
స్వర్గ ఫలాల తేనియాలని చప్పరిస్తూ, జుర్రుకుంటూ..
గ్రోలుకుంటూ ...
దాన్నే కొనసాగిస్తూ...

---మా. హరికృష్ణ

Thursday, May 29, 2008

drushyam

కంటికి నిదురే రాదు

నిన్ను చేరే మార్గమే లేదు

అయినా-

గుండె సవ్వడిలో

ఆలోచనల ఉరవడిలో

నన్ను ఆసాంతం కమ్మేసిన రూపం

నీదే..

On Losing a Golden Moon

On Losing A Golden Moon

Kindling candles in the night
gazing looks, made me bright
vanishing darkness is in sight
managing sensibilities are here, upright
sparkling stars emerged in straight
stagnating rays surprised in the moonlight

Now,the moon left me
rays broken me
stars wounded me
candles are burning me
No morning is here for me
Alas, mourning only personified into me...